Post a Comment

  1. సదరు పాస్టర్ గారి బాధ విగ్రహారాధన గురించి అని అర్థం అవుతోంది. అటువంటి వారిని “ప్రభువు” శిక్షించాడని, శిక్షిస్తాడనీ వారు హెచ్చరిస్తున్నట్లుంది. వారి వారి నమ్మకాలను బట్టి ఆ మతం వారికి మాత్రం ఆ పాస్టర్ గారి విమర్శలు సబబుగానే తోస్తుండవచ్చు మరి అదే లాజిక్ తో చూస్తే ..ఎవరైనా హిందువు. అజ్మీర్ దర్గాకు వెళ్ళి ఛద్దర్ సమర్పిస్తే అటువాంటి వారిని హిందూ దేవుళ్ళు కూడా ఆ కారణాన శిక్షిస్తారా? ఇవన్నీ నమ్మకాలను బట్టి ఉంటుందండి. విమర్శించే వారు తమ అస్తిత్వాన్ని చూపించుకునే ప్రయత్నమేమో?

    విడియో తతిమ్మా భాగమంతా “డిక్లరేషన్” మీద చర్చే. ఏదీ తెగదు. చానెళ్ళకు కావలసినదీ అదే కదా?

    ReplyDelete
    Replies
    1. దేవుడనేవాడు అంత శాడిజం కలిగి ఉంటాడా? మరి పాపులను రక్షిస్తాడు... రక్షకుడు .. మన పాపములను మోయుటకు వచ్చినవాడు..... అని కూడా కొందరు చెప్పుచుండగా వింటిని.

      Delete
    2. వీల్లంతా నాయకులు. వీల్లకి కావల్సింది మందబలం. దైవబలం కాదు.

      Delete
    3. "దేవుడనేవాడు అంత శాడిజం కలిగి ఉంటాడా"

      కొండలరావు గారూ, పాత గ్రంధం (old testament) దేవుడు అట్లాగే ఉంటాడండీ.

      ఆదిమ మానవుడు గుహలలో ఉంటూ ఆకులు కప్పుకొని పచ్చి మాంసం కొరుక్కుతినేటప్పడి "దేవుడి" నైజం ఆ కరుకు పరిస్థితులను ప్రతిబింబించడం సహజమే కావొచ్చును. కాలక్రమేణా మనిషి ఆలోచనలు పరిపక్వత చెందాక అతడు ఊహించే "దేవుడు" పెరిగిన మేధస్సుకు అనుగుణంగా ఇంకొంచం ఉదారతతో కూడి ఉంటాడు.

      Delete
    4. చర్చిలకి వ్యతిరేకంగా జీసస్ లేదా క్రిస్టియన్ దేవుడే పోరాడాడు. అందుకే సిలువ వేయబడింది.. ఎవ్వడికైనా మందబలమే కావల్సింది. దేవుడు బలం కాదు.

      https://youtu.be/i_Iue93PsoE

      Delete
  2. సౌందర్య, బాల యోగి గారు కూడా విమాన ప్రమాద ఘటన లోనే చనిపోయారు.బాలసుబ్రహ్మణ్యం గారు క్రైస్తవ భక్తి గీతాలు పాడారు కాబట్టి కరోనా తో చనిపోయారని కూడా అనుకోవచ్చు.పాస్టర్ గారిష్టం.

    ReplyDelete
  3. It is difficult to type Telugu on my new VoLTE mobile. Therefore I uploaded this video: https://youtu.be/6vNVOH_sv-c

    ReplyDelete
    Replies
    1. తీరిగ్గా కూర్చుని చేసే వీడియోలో కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వడం తెలియకపోతే ఎట్లా ప్రవీణూ!

      ఏం చెప్పాలని వీడియో చేశావు?ఏ ప్రస్తావనతో మొదలుపెట్టావు?ఏ ప్రస్తావనలోకి జంపయ్యావు?ఏ ప్రస్తావనతో ఆగిపోయావు?కేవలం 2:38 నిమిషాలు కూడా ప్లాన్ చేసుకుని మాట్లాడలేనివాడివి ఎందుకు ప్రతి దాని గురించీ నీకు తెలిసిన విజ్ఞానసర్వస్వం మొత్తాన్ని చెప్పెయ్యాలని ఇంత తాపత్రయపడతావు?

      మరోసారి నువ్వే విని నువ్వు చెప్పింది నీకే ఎంత అర్ధమయిందో చూసుకో.

      బ్లాగుల్లోకి వచ్చిన మొదటి రోజున నీ అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో ఇంత కాలం తర్వాత కూడా అదే స్థాయిలో ఉంది - కొత్త విషయాలు ఏమాత్రం నేర్చుకోకుండా పాత చెత్తనే దశాబ్దాల పాటు గుమ్మరించడం ఒక్కటే నీలోని గొప్పతనం.

      శభాష్!

      Delete
    2. ప్రవీణు, కెమెరావైపు చూడటానికి కూడా సిగ్గయితే ఎలా?!

      Delete
    3. అజ్ఞానం ఏముంది? గోల్కొండ కుతుబ్‌షా భద్రాచల సీతారాములుకి పట్టు వస్త్రాలు పంపితే అతనొక సెక్యులరిస్ట్! అలాంటి పనే క్రైస్తవ ముఖ్యమంత్రులు చేస్తే అవి హిందువుల వోట్ల కోసం నాటకాలు! మనవాళ్ళ తెలివి ఇలాగే ఉంది కదా.

      Delete
    4. This is my latest video. Here my speech is clear than that in earlier videos. https://youtu.be/SpWybTR5xMI

      Delete
    5. ప్రవీణూ!

      గోల్కొండ కుతుబ్ షా సెక్యులరిస్టా?పదహారణాల ముస్లిము సెక్యులరిస్టు ఎలా అవుతాడు?అసలు కుతుబ్ షా సెక్యులరిస్టు అని ఎవరన్నారు?

      ముస్లిం అయిన ప్రతివాడూ హిందూమతాన్ని ద్వేషించినట్టు గానీ హిందూమతాన్ని ధ్వంసం చెయ్యాలని గానీ చూశాడా!పోనీ హిందువులు ప్రతి ముస్లిమునీ శత్రుభావంతో చూస్తున్నారా!

      ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం బావిని కట్టించినది ఒక ముస్లిం.బిస్మిల్లా ఖాన్ ఎవరు?వాళ్ళెవరూ మతం మారిపోయి హందువులు అయిపోలేదే - తమ మతాన్ని పాటిస్తూనే హిందూమత్మ్ పట్ల ద్వేషం లేకుండా హుందాగా ఉన్నారు.హిందువులు కూడా అటువంటి ముస్లిములాలో ఎవరినీ అవమానించడం లేదు.దీనికి కూడా సెక్యులరిజం లేబుల్ తొడగాలా?

      ఇంగ్లెషువాళ్ళు కొత్తల్లో ఆలయాలలో విసేష పూజలు జరుగుత్య్న్నప్పుడు వాళ్ళకి తెలిసిన తుపాకులు గాల్లోకి పేల్చడం లాంటివి చేసేవాళ్ళు - అప్పుడు వోట్లూ ఎన్నికలూ లేవే!

      అప్పుడు కలక్టర్లు/ప్రెసిడెన్సీ ఉద్యోగులు చేసే అలాంటి పన్లని స్వతంత్రం వచ్చాక ముఖ్యమంత్రులు చెస్తున్నారు, అది మానవ సహజమైన మర్యాద కోసం తప్పితే చేసి తీరాలని రాజ్యాంగం చెప్పలేదు.క్రైస్తవం విగ్రహారాధనని ఒప్పుకోదు కాబట్టి నేను చెయ్యనని అంటే ఎవరూ చెయ్యగలిగింది కూడా లేదు.పట్టు వస్త్రాలు పంపించడం అన్న ఒక చిన్న పనికి ఎన్ని వోట్లు పడాతాయో నీ అద్గ్గిర లెక్క ఉందా?

      తలా తోకా లేని వాగుడు కాకపోతే ఏమిటిది?

      ఎందుకీ సోది?

      Delete
    6. ప్రవీణూ!

      గోల్కొండ కుతుబ్ షా సెక్యులరిస్టా?పదహారణాల ముస్లిము సెక్యులరిస్టు ఎలా అవుతాడు?అసలు కుతుబ్ షా సెక్యులరిస్టు అని ఎవరన్నారు?

      ముస్లిం అయిన ప్రతివాడూ హిందూమతాన్ని ద్వేషించినట్టు గానీ హిందూమతాన్ని ధ్వంసం చెయ్యాలని గానీ చూశాడా!పోనీ హిందువులు ప్రతి ముస్లిమునీ శత్రుభావంతో చూస్తున్నారా!

      ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం బావిని కట్టించినది ఒక ముస్లిం.బిస్మిల్లా ఖాన్ ఎవరు?వాళ్ళెవరూ మతం మారిపోయి హందువులు అయిపోలేదే - తమ మతాన్ని పాటిస్తూనే హిందూమతం పట్ల ద్వేషం లేకుండా హుందాగా ఉన్నారు.హిందువులు కూడా అటువంటి ముస్లిములలో ఎవరినీ అవమానించడం లేదు.దీనికి కూడా సెక్యులరిజం లేబుల్ తొడగాలా?

      ఇంగ్లీషువాళ్ళు కొత్తల్లో ఆలయాలలో విశేష పూజలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలిసిన తుపాకులు గాల్లోకి పేల్చడం లాంటివి చేసేవాళ్ళు - అప్పుడు వోట్లూ ఎన్నికలూ లేవే!

      అప్పుడు కలక్టర్లు/ప్రెసిడెన్సీ ఉద్యోగులు చేసే అలాంటి పన్లని స్వతంత్రం వచ్చాక ముఖ్యమంత్రులు చెస్తున్నారు, అది మానవ సహజమైన మర్యాద కోసం తప్పితే చేసి తీరాలని రాజ్యాంగం చెప్పలేదు.క్రైస్తవం విగ్రహారాధనని ఒప్పుకోదు కాబట్టి నేను చెయ్యనని అంటే ఎవరూ చెయ్యగలిగింది కూడా లేదు.పట్టు వస్త్రాలు పంపించడం అన్న ఒక చిన్న పనికి ఎన్ని హిందువుల వోట్లు పడతాయో నీ దగ్గిర లెక్క ఉందా?తలా తోకా లేని వాగుడు కాకపోతే ఏమిటిది?

      ఎందుకీ సోది?

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top